NDL: ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల ఎంపిక జాబితాను బుధవారం ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ దాసు తెలిపారు. ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల జాబితా పాఠశాలలో అందుబాటులో ఉందన్నారు. పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులు ధ్రువపత్రాలతో పూర్తి వివరాల కోసం స్థానిక మోడల్ స్కూల్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.