ASF: ఈనెల 29న రాష్ట్ర గవర్నర్ జిల్లాలో పర్యటించనున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.35కు కలెక్టరేట్‌కు చేరుకుని 11 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రౌట సంకేపల్లి గ్రామంలో జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవంలో పాల్గొంటారు. పర్యటన నేపథ్యంలో భద్రత, రవాణా, వైద్య ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.