TG: ఎవరెస్ట్‌పై మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ మృతదేహాన్ని పర్వతంపైనే వదిలేయాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. డెత్ జోన్ నుంచి మృతదేహాన్ని తేవడం ప్రమాదకరం, అత్యంత ఖర్చుతో కూడుకున్నదని నిర్వాహకులు తెలిపారు. దీంతో శివుని నివాసంలో ప్రాణాలు విడిచినందున అక్కడే వదిలేయాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.