SRCL: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ద్వారా మంజూరు అయిన 46 లక్షలతో నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి చేశారు.