W.G: సుప్రీంకోర్టు తనకు షాక్ ఇచ్చిందంటూ జడ శ్రవణ్ కుమార్ వాస్తవ విరుద్ధమైన ప్రచారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. బుధవారం పెదఅమీరంలో ఆయన మాట్లాడారు. శ్రవణ్ కుమార్ చెప్పిన అసత్యాలు కోర్టు రికార్డుల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని రఘురామ ధీమా వ్యక్తం చేశారు