సత్యసాయి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతా తెరవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి జి.రెడ్డి బాలాజీ తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం నిధులు జూన్లో విడుదల కానున్న నేపథ్యంలో మే 31 లోపు ఖాతా తెరిచి, ఎన్పీసీఐ లింక్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.