TG: మాజీమంత్రి కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. ‘హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినా రాజీనామా చేస్తానని కేటీఆర్ అంటున్నారు. అర్బన్ ప్రాంతంలో మీ కంటే ఎక్కువ ఇళ్లు కడతాం. ఇళ్లు కట్టాకే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు కట్టినట్లు మేం నిరూపిస్తే.. కేటీఆర్ పోటీకి దూరంగా ఉంటారా?’ అని సవాల్ విసిరారు.