కృష్ణా: తాడేపల్లిలో YCP ముఖ్య నేతల సమావేశం బుధవారం రాజకీయంగా ఆసక్తి రేపింది. సమావేశానికి గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ, మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా హాజరయ్యారు. పార్టీ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, జిల్లాల వారీగా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం ముగ్గురు నేతలు కొంతసేపు ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.