SS: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల మ్యాపింగ్, బీఎల్ఓల ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని పోలింగ్ స్టేషన్లు 110, 113 లలో ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలని, మున్సిపాలిటీ పరిధిలో పనితీరు మరింత మెరుగుపడాలని అధికారులను ఆదేశించారు.