AP: తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. త్వరలోనే తెలంగాణలో నాయకులందరినీ కలుస్తానని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో TDP పూర్వ వైభవం కోసం మహానాడులో తీర్మానం చేశారు. పార్టీ నుంచి వచ్చే ఆదేశాలను తెలంగాణ క్యాడర్ పాటించాలని లోకేష్ పిలుపునిచ్చారు.