WGL: నల్లబెల్లి మండలానికి చెందిన సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఇవాళ మంత్రి సీతక్కను కలిశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, పీఎఫ్, ఇన్సూరెన్స్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు CH.కుమారస్వామి మాట్లాడుతూ.. కార్మికుల సమస్య తక్షణమే పరిష్కరించాలని మంత్రిని కోరారు.