WGL: నర్సంపేట నియోజకవర్గం పరిధిలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ ఘనంగా జరిగింది. నర్సంపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు, యువకులు, రైతులు పెద్దఎత్తున పార్టీలో చేరారు. బాధ్యులు డాక్టర్ బోడ అనిల్ కుమార్, జిల్లా ఇంఛార్జ్ వెంకటేశ్వర్లు రావు జెండా ఆవిష్కరించారు. కవిత నాయకత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో పార్టీలో చేరారని ఆయన అన్నారు.