AP: రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని, హామీల పేరుతో బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జూన్ 4 నుంచి 12 వరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని చెప్పారు. TDP సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్ షో అని ఎద్దేవా చేశారు.