బాపట్ల కలెక్టరేట్లో బుధవారం ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ‘PGRS’ నిర్వహించారు. అర్జీల స్వీకరించిన కలెక్టర్ డా. వీ. వినోద్‌కుమార్.. దివ్యాంగులను ఆఫీసుల చుట్టూ తిప్పకుండా సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి నెల నాలుగో బుధవారం ఈ ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు.