MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం భూత్పూర్ మండలం హస్నాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచుతోందని ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే అకాల వర్షాలకు వరి ధాన్యమంతా తడిసిపోయిందన్నారు.