SDPT: హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ (SUCE) బ్రోచర్, కోడ్ పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే ఈ కాలేజీ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందులో CSE, AI, ECE, IT, బయోటెక్ కోర్సులలో మొత్తం 300 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.