సత్యసాయి: తాడేపల్లిలోని YCP కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో మాజీ మహిళా మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ, మహిళా నేతల పాత్రపై ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు.