ధోనీ IPL ఫ్యూచర్‌పై CSK సీఈఓ కాశీ విశ్వనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ప్లేయర్, కోచ్ లేదా మెంటార్‌గా.. ఏదో ఒక పాత్రలో ధోనీ ఎల్లప్పుడూ మా జట్టుతోనే ఉండాలి. ధోనీ లీడర్షిప్ వల్లే CSK జట్టుకు ఈ స్థాయి భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. భవిష్యత్తుపై తుది నిర్ణయం పూర్తిగా ధోనీదే. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము గౌరవిస్తాం’ అని పేర్కొన్నారు.