AKP: మాకవరపాలెం మండలం రాచపల్లిలో మంచానికే పరిమితమైన ఆటోడ్రైవర్ పట్నాల శ్రీనుకు విశాఖ జిల్లా రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయిస్ వెల్ఫెర్ అసోసియేషన్ నుంచి బుధవారం రూ.60 వేలు ఆర్ధిక సాయం అందించారు. రెండేళ్లుగా శ్రీను మంచం పట్టిన విషయం తెలుసుకున్న వారు వైద్య ఖర్చుల నిమిత్తం ఈ సాయం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి మధు పాల్గొన్నారు.