NLG: మాడుగులపల్లి మండలం పరిధిలోని గారకుంటపాలెంకి చెందిన యువ బాస్కెట్బాల్ క్రీడాకారిణి జొన్నలగడ్డ విహారెడ్డి భారత మహిళల జట్టుకు కెప్టెన్గా ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకుంది. దక్షిణాసియా క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహించనుంది. గతంలో మలేషియాలో జరిగిన FIBA అండర్-16 మహిళల ఆసియా కప్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించారు.