BPT: బాపట్ల రైలుపేటలో చోరీ జరిగింది. పండుగకు సయ్యద్ అన్వర్ పాషా కుటుంబం నరసరావుపేట వెళ్లింది. బుధవారం ఉదయం తిరిగొచ్చి చూడగా ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపల బీరువాలను ధ్వంసం చేసిన దుండగులు నగదు, ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.