CTR: వివాహేతర సంబంధంతో ఇద్దరు కొడుకులను చంపిన తల్లికి కోర్టు జీవిత ఖైదు విధించింది. రామకుప్పం మండలానికి చెందిన వేమారెడ్డికి పవిత్రతో వివాహం జరిగింది. వేమారెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న వేమన్నతో ఆమెకు సంబంధం ఏర్పడింది. 2017 సెప్టెంబరులో తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని 6, 3 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమారులను ఉరివేసి చంపింది.