SRCL: నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది బదిలీల ప్రక్రియ చేపట్టామని కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సిబ్బంది వివరాల ప్రక్రియను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్థానం నుంచి ఇతర స్థానాలకు పారదర్శకంగా సిబ్బందిని బదిలీ చేశామన్నారు.