HNK: ఆర్ఈసీ ప్రస్తుత నిట్ కళాశాలలో 1978లో వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ) వేడుకల ప్రస్థానం మొదలైంది. 47 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రఖ్యాత కళాశాలల నుంచి విద్యార్థులు ఇందులో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటారు.