PPM: జిల్లాలో మండుటెండర్లో ఉపాధి హామీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మరణించిన ఉపాధి వేతనదారులను ప్రభుత్వం ఆదుకోవాలని పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిన మోహన్ డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో జిల్లాలో వడదెబ్బ ద్వారా అనేక మరణాలు సంభవించడం జరిగిందన్నారు. సకాలంలో వైద్యం అందక ఉపాధి కార్మికులు చాలాచోట్ల మరణించారని ఈ సందర్భంగా తెలిపారు.