SDPT: హుస్నాబాద్ మండలం కూచనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోళ్లు ఆలస్యంగా సాగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిల్లర్లపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.