KKD: పెద్దాపురం మండలం దివిలి గ్రామంలోని విజయలక్ష్మి ఆగ్రో ఏజెన్సీస్లో రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లైసెన్సులు, ఎరువులు, పురుగుమందుల విక్రయ రికార్డులను పరిశీలించి ఎలాంటి అవకతవకలు లేవని నిర్ధారించారు. అయితే ముందస్తు చర్యగా 270 లీటర్ల పారాక్వాట్ మందు విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.