TG: ఎబోలాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఎబోలా ప్రభావిత దేశాల నుండి ఈ నెల 25 నాటికి 58 మంది వచ్చారని, విమానాశ్రయాల్లో వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాధితులు 21 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 10 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు.