AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. హమీల అమలులో పూర్తిగా విఫలమైందని YCP ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం మూడున్నర లక్షల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకువచ్చిందని.. అసలు ఆ డబ్బు ఏమవుతోందని ప్రశ్నించారు. మంత్రులు తమ శాఖలను వదిలేసి, జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.