BHPL: రేగొండ మండలం లింగాల గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా, స్థానికుడు లింగారపు తిప్పారపు రాజుపై పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.