TPT: వాకాడు మండల కేంద్రంలో మే 27, 28 తేదీల్లో జరగనున్న ‘డిజిటల్ మహానాడు’ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేపట్టారు. గూడూరు నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మి ఏర్పాట్లను పరిశీలించి, ప్రతి కార్యకర్త భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పార్టీ బలోపేతానికి మహానాడు దోహదపడుతుందని తెలిపారు.