NZB: జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మేకల సంత నిర్వహణకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. జూన్ 5 నుంచి మేకల సంత ప్రారంభమవుతుందని, అనంతరం ప్రతి శుక్రవారం సంత నిర్వహించనున్నట్లు సర్పంచ్ కందగట్ల రాంచందర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.