WGL: రాయపర్తి మండలంలో వడదెబ్బ కారణంగా ఇద్దరు మృతి చెందారు. మంగళవారం కొత్తూరు గ్రామానికి చెందిన ఆకారపు మల్లికాంబ (59) అస్వస్థతకు గురై ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. అలాగే కొండూరు గ్రామానికి చెందిన ఈ రెడ్డి సీతారాం రెడ్డి(67) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.