KMM: తల్లాడ ఆర్సీఎం చర్చి నుంచి నారాయణపురం వెళ్లే రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. రోడ్డు చివర వైన్స్ ఉండడంతో రాకపోకలు మరింత ఎక్కువయ్యాయి. ఒకవైపు చర్చి గోడ, మరోవైపు రక్షణ లేని తెరిచిన డ్రైనేజీ వల్ల ప్రయాణం ఇబ్బందిగా మారింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ రక్షణ గోడలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.