KMM: రాష్ట్ర సచివాలయంలో ఇవాళ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణతో పాటు 66 ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా పథకం అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించే దిశగ ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు.