RR: ప్రభుత్వ తెలంగాణ పబ్లిక్ స్కూల్ & జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమైనట్లు హెడ్ ఆఫ్ ది స్కూల్ సిద్దగోని గిరిధర్ గౌడ్ తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు రిటైల్ బిజినెస్ మేనేజ్మెంట్, మల్టీమీడియా వంటి వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.