JGL: ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి, 10 రోజుల్లో పూర్తి చేయాలని జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మల్లాపూర్ మండలం కుస్థాపూర్ కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని 24 గంటల్లోగా అన్లోడింగ్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కూడా వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలన్నారు.