BPT: అమృతలూరు మండలం పెదపూడి బాప్టిస్ట్ చర్చి 75వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు విచ్చేశారు. చర్చి కమిటీ ప్రతినిధులు ఆయనను సత్కరించారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంచడంలో చర్చిలది కీలక పాత్ర అని ఎమ్మెల్యే కొనియాడారు. వారు చేస్తున్న సామాజిక సేవలను ఆయన అభినందించారు.