WGL: సంగెం మండలం వీఆర్ఎన్ తండాలో మూడు రోజులుగా తాగునీరు సరఫరా లేకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం ఆందోళన చేపట్టారు. నీటి కొరతతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే తమను గుర్తిస్తున్నారని, అనంతరం తండాను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తాగునీరు సరఫరా చేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తాం అని పేర్కొన్నారు.