BHPL: సరస్వతి అంత్య పుష్కరాల్లో మహిళా భక్తులను వేధింపులకు గురిచేశారంటూ కాళేశ్వరం ఆలయ ఛైర్మన్ మోహన్ శర్మను వెంటనే పదవి నుంచి తొలగించాలని కుల సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మన్ పీకా కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం కాళేశ్వరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఛైర్మన్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.