VZM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని వైసీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసనాయుడు విమర్శించారు. చీపురుపల్లి పెట్రోల్ బంక్‌ను మంగళవారం సందర్శించారు. గత పది రోజుల్లో నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచారని, దీంతో ఆటో డ్రైవర్లు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.