MHBD: మహబూబాబాద్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు జడ్జి అబ్దుల్ రఫీ మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు. 2025లో తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పీ.రాముకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,500 జరిమానా విధించారు. బాధితురాలికి తెలంగాణ బాధితుల నష్ట పరిహార పథకం కింద రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.