ప్రకాశం: ప్రజల సంతృప్తి కోసం అధికారులు పూర్తిస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ ఎం. విజయ సునీత సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో పెన్షన్లు, ఐవీఆర్ఎస్ కాల్స్‌పై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. పెన్షన్ పంపిణీలో నిర్లక్ష్యం వద్దని, ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని ఆదేశించారు.