MHBD: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన గిరిజన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆమె విమర్శించారు. కేసీఆర్ హయాంలో గిరిజనుల అభివృద్ధి, రిజర్వేషన్ల పెంపు, తండాల గ్రామాలుగా మార్పు వంటి కీలక నిర్ణయాలు జరిగాయని ఆమె పేర్కొన్నారు.