AKP: నక్కపల్లి మండలంలో పలు గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు. వేంపాడు గ్రామ పరిధిలో జరుగుతున్న చెరువును పరిశీలించారు. ప్రభుత్వం జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువుల అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధి పనుల్లో వేతనదారులు ఎక్కువ మంది పాల్గొనే విధంగా అధికారులు చూడాలన్నారు.