BHPL: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా తహసీల్దార్లు ప్రత్యేక అధికారులుగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఇవాళ ఐడీఓసీ కార్యాలయం నుంచి MROలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. లారీలు లేకపోతే ట్రాక్టర్ల వినియోగం, ట్యాబ్ ఎంట్రీ వేగవంతం, గోదాముల సమర్థ వినియోగంపై ఆదేశాలు జారీ చేశారు.