AP: కడప జిల్లా ప్రొద్దుటూరులో TDP నేత ప్రవీణ్, MLA వరదరాజుల రెడ్డి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇవాళ SS మాల్ పరిశీలనకు ప్రవీణ్ వెళ్లగా MLA అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు ప్రవీణ్‌ను ఇంటికి పంపగా, MLA అనుచరులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో 2 వర్గాలు బాహాబాహీ, రాళ్లదాడికి దిగాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు.