ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ MLC కె.నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనపై APలో కేసులు నమోదు కావడంతో, నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు TGకి వచ్చారంటూ నెట్టింట ప్రచారం సాగింది. అయితే, దీన్ని AP ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఖండించింది. ఇదంతా కొందరు చేస్తున్న అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. ఈ పోస్టును TDP కూడా రీపోస్టు చేసింది.