JGL: రైతులు పంటల అవశేషాలను కాల్చవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు పంటలను కాల్చడం ద్వారా కలిగే నష్టాలను వివరించారు.