NLG: కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై స్థానిక సీపీఎం కార్యకర్తలు సాగర్ రోడ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ధరలు పెంచుతూ సామాన్యునికి అందుబాటులో లేకుండా చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఆటోకు తాళ్లు కట్టి లాక్కుంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.